సబ్‌స్టేషన్‌ ముందు యువకుల ధర్నా

ధర్మపురి: మండలంలో విద్యుత్‌కోతకు నిరసనగా ధర్మపురి సబ్‌స్టేషన్‌ ఎదుట యువకులు బైఠాయించారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ తీవ్రమైన విద్యుత్‌కోత ఉండటంతో యువకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్‌కోత తగ్గించాలని ఏఈకి వినతిపత్రం సమర్పించారు.