సభాగౌరవం పెంపొందేలా చర్చలు ఉండాలి: సభాపతి

హైదరాబాద్‌: సభా గౌరవం పెంపొందేలా చర్చలు ఉండాలన్నదే తన ఉద్దేశమని సభాపతి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదం కోసం పటిష్ఠమైన విధానం అమలు చేస్తామని సభాపతి తెలిపారు. స్థాయీ సంఘాలపై జనవరి 7 నుంచి శాసనసభ్యులకు అవగాహనసదస్సు నిర్వహించనున్నట్లు స్పీకర్‌ తెలిపారు.