సభాపతి చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ…
: మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న స్పీకర్..
రుద్రూర్ (జనంసాక్షి) :- తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఆడ పడుచుల తో కలిసి శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు.. ముందుగా ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు ఆత్మగౌరవంతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని, దేవుళ్ళను పువ్వులతో పూజిస్తాం, కానీ పువ్వులనే పూజించే పవిత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని ఆయన వివరించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు ఒక కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రుద్రూర్ మండలానికి 700 బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఒక మేనమామ లాగా, అన్న దమ్ములాగా బతుకమ్మ పండుగ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆడపడుచులు అందరూ సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన కొనియాడారు. అనంతరం స్థానిక మండల ప్రజా ప్రతినిధులతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ కిరణ్ కుమార్, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం,
తెరాస మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ స్థానిక సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, తహసిల్దార్ ముజీబ్, మండల అభివృద్ధి అధికారి బాల గంగాధర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ తోట సంగయ్య, మాజీ విండో ఛైర్మన్
పత్తిరాము, అక్కపల్లి నాగేందర్,
మండల కో అప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు షేక్ ఖాదర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ,పీఏసిఎస్ చైర్మెన్ బద్దం సంజీవ్ రెడ్డి, సంగమేశ్వర్, , నెరుగంటి బాలరాజు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తెరాస పార్టీ కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.