సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ
బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్
బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్ ముఖ్య ఉద్దేశం : చైర్మన్
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన బాలల హక్కుల బాలల న్యాయ చట్టం`2015 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఇతర సభ్యులతో కలిసి మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్లో బాల అదాలత్ బెంచ్‌ను ఏర్పాటు చేసి బాలలు, వారి తల్లిదండ్రులు, పోషకుల నుంచి బాలల సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్, కమిషన్ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కమిషన్ ద్వారా బాలలకు జీవించే హక్కు కల్పించడం, రక్షణ పొందే హక్కు ఏర్పాటు చేయడం, అభివద్ధి చెందడానికి, భాగస్వామ్యం పొందడానికి ఈ కమిషన్ ద్వారా వారికి రక్షణ కల్పిస్తుంన్నారు. ఈ ప్రయాణం కేవలం నాంది మాత్రమేనని, బాలల హక్కుల పరిరక్షణలో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వారి హక్కుల పట్ల పెద్దఎత్తున అవగాహన కల్పించడంతోపాటు తల్లిదండ్రులకు వారి బిడ్డల హక్కులపై పూర్తిగా తెలిసేలా సమస్యల పట్ల వారు అధికారులు కమిషన్ దష్టికి తీసుకువచ్చేలా.. తద్వారా 18 సంవత్సరాల్లోపు బాలల సమస్యలను పరిష్కరించి వారి సత్వర న్యాయం కోసం కమిషన్ కషి చేస్తుందన్నారు. ఫిర్యాదులు స్వీకరించడం ద్వారా సంబంధిత అధికారులకు వాటిని తగు చర్యకు ఆదేశించడం కాకుండా అన్ని శాఖల అధికారులతో కమిషన్ సమష్టిగా పనిచేసి బాలల ఆరోగ్యం, విద్య,
న్యాయం కోసం ఎల్లప్పుడు కషి చేస్తుందన్నారు. ప్రతి బిడ్డ సమస్య పరిష్కారానికి అందరం కలిసి కషి చేద్దామన్నారు. బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు వారి హక్కులపై ఏర్పాటైన చట్టాలు అమలు కాకపోవడం ప్రభుత్వ సూచనలను ఆజ్ఞలను ఉల్లంఘించినపుడు కమిషన్ కలుగచేసుకుంటుందని, ఫిర్యాదులు స్వీకరిస్తుందని నోటీసులు జారీ చేస్తుందని కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఇవ్వబడ్డాయని, బాలల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఏ వ్యక్తినైనా కమిషన్ ముందు హాజరు పరచవచ్చని, మరెన్నో అధికారాలు ఈ కమిషన్ కు ఇచ్చారని ఆయన వివరించారు. ఫిర్యాదుదారులు తమ సమస్యలను రాతపూర్వకంగా విన్నవించుకోవచ్చని, ఫిర్యాదులు వారి అన్ని వివరాలు అందించాలని తద్వారా సంబంధిత శాఖలకు కమిషన్ ద్వారా ఆర్డర్ ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ బాలల హక్కుల కోసం ఏర్పడిన ఈ కమిషన్ కేవలం హైదరాబాద్‌లో ఉండి సమస్యలు వినడం కాకుండా మన దగ్గరికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించడం విచారణ జరపడం ఎంతైనా మన అదష్టమని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడిని నిజం చేయడానికి వారి అభివద్ధి కోసం వారి రక్షణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కషి చేయడం ఆనందించవలసిన విషయమన్నారు. పిల్లలకు జీవించే హక్కుతోపాటు విద్య, వైద్యం ముఖ్యమైన సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం వాటిని పక్కాగా అమలు జరిగే విధంగా చూడడం తదితర పనులకు కమిషన్ పనిచేస్తుందని, ఈ దిశగా మనమంతా కూడా అటు బాలలకు ఇటు కమిషన్ పూర్తిస్థాయిలో సహకారం అందించవలసిన విషయం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు విద్య, స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో
అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, కమిషన్ సభ్యులు బందాధర్ రావు, అరుణ, రాగ జ్యోతి, దేవయ్య, శోభారాణి, జిల్లా సంక్షేమ అధికారిణి రaాన్సీ, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.