సమస్యలను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

లక్ష్యిత్‌పేట: వృద్ధుల, వితంతువుల పింఛను రూ. వెయ్యికి పెంచాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం విజయవంతం చేయాలని కన్వీనర్‌ రమేష్‌ పిలుపునిచ్చారు. ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించనున్న యుద్ధబేరి మహాసభకు వృద్ధులు, వితంతువులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి సమస్యలపై పోరాడాలన్నారు. దీనికి సంబంధించిన గోడప్రతులను వారు విడుదల చేశారు.