సమస్యలు పరిష్కరించాలని బ్రతుకమ్మ ఆడిన విఆర్ఏలు
జనం సాక్షి, చెన్నరావు పేట
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె 67వ రోజున నర్సంపేట డివిజన్లో మండలాల వీఆర్ఏలు 200 మంది వీఆర్ఏలతో నర్సంపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా బతుకమ్మ ఆడి ముఖ్యమంత్రి అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు, వీఆర్ఏలందరికి పే స్కేలు, 55 సంవత్సరాల నుండి వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని నర్సంపేట డివిజన్ లోని వీఆర్ఏ లు అందరూ పెద్ద ఎత్తున వచ్చి బతుకమ్మ కార్యక్రమాన్ని చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో చేన్నారావుపేట అధ్యక్షులు శీలం రాజు, కో చైర్మన్ చాగంటి శివ కోటి, కోరే శోభారాణి, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్, జ్యోతి, రమేష్, శ్రీలత, రాజ్యలక్ష్మి, పాపయ్య, సారంగపాణి, సలీం, సుదర్శన్, సునీల్ తదీతరులు పాల్గొన్నారు.