సమస్య పరిష్కారమే కీలకం: బొత్స
హైదరాబాద్: కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహాలు ముఖ్యం కాదని తెలంగాణ సమస్యలకు పరిష్కారమే కీలకమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ అంశంపై నెల రోజుల్లోపు నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో కేంద్రంపై నమ్మకం ఉండాలని ఆయన అన్నారు. గాదె వెంకటరెడ్డి చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమే కాని కాంగ్రెస్‌ది కాదని ఆయన స్పష్టం చేశారు.