సమాచార హక్కు ఒక వజ్రాయుధం
కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్ కామారెడ్డి కార్యాలయం సమావేశం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సభాఅధ్య క్షులుగా ఎంఏ.సలీం, రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి అధ్యకులు (హైకోర్టు అడ్వకే టుగా వ్యవహరించారు. ఈ కార్యక్ర మంనకు ముఖ్యఅథిధిగా శ్రీ భరత్ నగేష్, వినియోగదారుల సేవా సంఘం అధ్యక్షులు ప్రత్యేక అథితిగా, ఆర్.వి.రమేష్ చంద్ విశిష్ట అతిధిగా మెడికల్ అఫీసర్ డా.పుట్ట మల్లికార్జున్ హజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినియోగదా రులు ప్రతి కొనుగోలు వస్తువుకి రశీదు పోంది నట్లు గానే వివిధ రంగాలలో అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రతి పౌరుడు కోరవచ్చనారు. రాష్ట్ర అధ్యక్షులు యం.ఏ. సలీం మాట్లాడుతూ ఈ చట్టం ఏర్పడి 7 సంవత్సరాలు అయిన అధికారులుక అవగాహన లేకపోవుట వలన గ్రామీణ ప్రాంంతాలలోని ప్రజలకు అవ గాహన కలగడం లేదన్నారు. సమాచారా హక్కు చట్టం ద్వారా జీవించె హక్కుకు భంగం కలిగిన సందర్భంలో మాత్రమే 48 గంటలలోపు సంబ ందిత అధికారి సమాచారం ఇవ్వవలసి ఉంటుందన్నారు. మల్లికార్జున్ మాట్లాడుతూ అవగాహన సదస్సులను గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఆ ప్రాంతంలోని స్కూల్ విద్యా ర్థులకు, కళాశాల విద్యార్థులకు అవగాహణ కల్ఫిం చడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని చట్టంపై అవగాహన ఉంటుందన్నారు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఉచ్చిత వైద్య సేవా క్యాంప్ నిర్వహించడానికి తాం సిద్దంగాఉన్నారన్నారు. రమేష్ చంద్ మాట్లాడుతూ అధికారులను బాధ్యు ల్ని చేసే హక్కు ఓక పౌరునికి సమాచారము హక్కు చట్టం ద్వారా మాత్రమే సద్యమాన్నారు. సామాన్య పౌరులు పోలీస్ స్టేషన్‌లో గాని వివిధ కార్యాలయాలలో గాని అధికారులను సమాచారం అడుగులేక పోవటానికి వారికి ఈ చట్టంపై అవ గాహన లేకపోవడం కారణమన్నారు. రాష్ట్ర కార్యదర్శి శర్‌బాని రాజేషం మాట్టాడుతు ఈ చట్ట ఒక వజ్రయుదాంలాంటి అన్నారు.
దీనిని అందరూ సద్వినియోగం పరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ, యం.ఏ.రశీద్, ఎం.ఏ. హ మీద్, రేషన్‌డీలర్, న్యాయ వాదులు, తదితరులు పాల్గొన్నారు.