సమాజంలో అత్యున్నత గౌరవం దక్కేది నాటికి… నేటికి… ఎప్పటికీ… ఉపాధ్యాయులకే

గరిడేపల్లి, సెప్టెంబర్ 19 (జనం సాక్షి): సమాజంలో అత్యున్నత గౌరవం దక్కేది నాటికి నేటికి ఎప్పటికీ  ఉపాధ్యాయులకే  అని గరిడేపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు పెండెం సుజాత  శ్రీనివాస్ అన్నారు. సోమవారం గరిడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల విద్యాధికారి చత్రు నాయక్ అధ్యక్షతన నేరేడుచర్ల  లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యడవెల్లి  సత్య నారాయణ రెడ్డి సమన్వయంతో 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జడ్పిటిసి సభ్యులు పోరెడ్డి శైలజ రవీందర్ రెడ్డి ఎంపీడీవో వనజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వేలాదిమంది సాధారణ పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలను అభినందించారు.
మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన గుత్తికొండ రామిరెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, బూస వెంకటేశ్వర్లు, రామిశెట్టి లక్ష్మయ్య, ఎల్లావుల నాగమణి, అనంతు రామారావు, దొంగరి అశోక్ కుమార్, మేకల సందీప్ కుమార్, చాప విజయకుమారి , గోదేశి దయాకర్, సత్తూరి బిక్షం, భద్రంరాజు శైలజ లను ఘనంగా పూలమాలలు శాలువాలతోసన్మానించారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో వీరు అందించిన సేవలను సభికులంతా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు మైనంపాటి ప్రభాకర్, ఎలక సైదిరెడ్డి, పాలూరు అంజయ్య, గొర్రె నాగరాజు, బానోతు నాగేశ్వరరావు, ఎర్ర కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ముప్పాళ్ళ సువర్ణ, నట్టె శ్రీనివాసరావు, కాట్రేవుల కనకయ్య, రామిశెట్టి వీరనారాయణ , ఎగ్లడి వెంకటేశ్వర్లు,చంద్రకంటి వెంకటేశ్వరరావు, ఓరుగంటి నాగేశ్వరరావు, సుందరి శ్రీనివాస్, రణబోతు రవీందర్ , కేవీ సత్యనారాయణ సిఆర్పిలు అశోక్,రామకృష్ణ, వెంకటేశ్వర్లు లయన్స్ క్లబ్ సభ్యులు జీలకర్ర  రామస్వామి, కొణతం సీతారాంరెడ్డి, సుందరి నాగయ్య, బట్టు మధు, శ్రీరామ్ రెడ్డి, కందిబండ  శ్రీను ,రామకృష్ణ, సూర్యనారాయణ రెడ్డి, పురుషోత్తం రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
Attachments area