సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యం: కేసీఆర్‌

 jn3rw5cuనల్గొండ: సమాజంలో ఉన్నతంగా బతకడమే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతుల్లో ప్రజాప్రతినిధులను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు. డబ్బు సంపాదించాలనుకుంటే.. పేడ కూడా అమ్మి డబ్బు సంపాదించుకోవచ్చన్నారు. కానీ, ఉన్నతంగా బతికితేనే మంచి గుర్తింపు ఉంటుందన్నారు. తాను రాజకీయ నాయకుడు కావాలని అనుకోలేదని.. అనుకోకుండానే పాలిటిక్స్ లోకి వచ్చానని సీఎం చెప్పారు. ఇప్పటివరకూ తాను 70, ఎనభై వేల పుస్తకాలు చదివానని చెప్పారు.