సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పోలీసు వారి పాత్ర కీలకమైనది

 పోలీసు శాఖలో సేవలు అందించడం ఉన్నతమైన ఉద్యోగంగా భావించాలి*
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
 సమాజంలో శాంతిభద్రతలు కల్పించడంలో పోలీసు వారిది కీలకమైన పాత్రని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.  నేడు నల్లగొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పోలీసు శాఖలో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు దేహదారుఢ్య పరీక్షల ట్రయల్స్   నిర్వహించుటకు వారి సౌజన్యంతో కంచర్ల మానస ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో అధిక సంఖ్యలో ఉద్యోగాల నియామకం  చేస్తున్నదని దీనికై నిరుద్యోగులు కష్టపడి చదివి దేహదారుద్య పరీక్షలలో అర్హత సాధించి ఉద్యోగాలు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎస్సై  కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనైనది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్ గోగుల శ్రీనివాస్ ఎడ్ల శ్రీనివాస్ వట్టిపల్లి శ్రీనివాస్ , సర్పంచ్ రొమ్ముల నాగయ్య మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్న భవిత ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు వెంకట్రెడ్డి  టిఆర్ఎస్ నాయకులు సంకు ధనలక్ష్మి సందినేని జనార్దన్ రావు, కంకణాల వెంకట్ రెడ్డి, పెరిక యాదయ్య, భాషపాక హరికృష్ణ మాతంగి అమర్ దుబ్బరూప తదితరులు పాల్గొన్నారు