సమావేశం రద్దు దురదృష్టకరం

1
: కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌ ఆగష్టు 23 (జనంసాక్షి):

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం జరగాల్సిన జాతీయ భద్రత సలహాదారుల సమావేశం రద్దయిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిచారు. సమావేశం రద్దు కావడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ల్షానవూలో సంస్కృత విద్యాపీఠంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌, పాక్‌ మధ్య భద్రతా సలహాదారు సమావేశం రద్దు కావడంపై ప్రస్తావించారు. చర్చలను రద్దు చేసిందని భారత్‌పై పాక్‌ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. చర్చలను రద్దు చేసింది తమ ప్రభుత్వం కాదని, భారత్‌ విధించిన నిబంధనలను అనుసరించి చర్చలు జరపడం తమకు సాధ్యంకాదని పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించిందన్నారు. కశ్మీర్‌ వేర్పాటు వాదులకు చర్చల్లో పాల్గొనేందుకు అనుమతినివ్వలేమంటూ ముందుగానే తేల్చి చెప్పామన్నారు. అయినా పాక్‌ వినకుండా.. కశ్మీర్‌ వేర్పాటు వాదులను కలిసేందుకు ప్రయత్రం చేసిందని, అందుకే తాము చర్చలకు నిబంధనలు పెట్టామని కేంద్రమంత్రి తెలిపారు. చర్చలు జరగకపోవడం నిజంగా దురదృష్టకరమని, దీనికి పాకిస్థానే కారణమని రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు.