సరస్వతీ పుష్కరాల వద్ద హనుమజ్జయంతి

కాళేశ్వరం : కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా సుమారు ఐదువేల మంది భక్తులు త్రివేణి తీర్థసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. హనుమజ్జయంతి పురస్కరించుకుని సుమారు నాలుగు వేల మంది హనుమాన్‌ భక్తులు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు చలువపందిళ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించేందుకు మూడు ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.