సర్కారుపై పోరు

4

– బచావత్‌ మిషన్‌ ఏర్పాటు

– ప్రభుత్వ విధానాలపై నాగం మండిపాటు

హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనంసాక్షి):

బిజెపితో సంబంధం లేకుండా ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డాక్టర్‌ నాగం జనార్దనరెడ్డి హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లో సొంత ఆఫీస్‌ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ బచావ్‌ మిషన్‌ పేరుతో ఆయన ఈ ఆఫీస్‌ ను ప్రారంబించారు. పార్టీతో సంబంధం లేకుండా ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ మిషన్‌ లో పాలు పంచుకుంటున్నారు. ఈ సందర్బంగా నాగం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాలకు ప్రధాన్యాలు తెలియడం లేదని, అనుభవ రాహిత్యంతో పాలన సగుతోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో తమ పోరాటం సాగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడడానికే ఈ మిషన్‌ ను సంకల్పించామని ఈ సందర్భంగా జనార్దనరెడ్డి చెప్పారు.గత కొంత కాలంగా బిజెపి తీరుపై ఆయన అసంతృఫ్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో నాగం సొంతంగా కర్యకలాపాల కోసం కార్యాలయాన్ని ప్రారంబించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మంత్రులంతా డవ్మిూలయ్యారని  నాగం జనార్దనరెడ్డి విమర్శించారు. బిజెపితో సంబందం లేకుండా ఆయన సొంత ఆపీస్‌ ను ఏర్పాటు చేసుకున్న తర్వాత విూడియాతో మాట్లాడుతూ తెలంగాణను కాపాడుకోవడానికే మిషన్‌ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌ లో చేర్చుకోవడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో చీప్‌ లిక్కర్‌ ఆలోచనను విరమించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరువు సమస్యలు, కెజిటు పిజి మొదలైన సమస్యలపై తమ మిషన్‌ పోరాడుతుందని ,అందరం కలిసి తెలంగాణను కాపాడుకోవాలని ఆని అన్నారు. గుడుంబా తాగితే అనారోగ్యం పాలైతే… చీప్‌లిక్కర్‌ తాగితే ఆరోగ్యం చెడిపోదా అని నాగం  ప్రశ్నించారు. కేసీఆర్‌ ఏడాదిలో మూడుసార్లు కాన్వాయ్‌ మార్చారని, మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను పేద రాష్ట్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. సెక్రటేరియెట్‌ను కూలగొట్టి బుర్జ్‌ఖలీఫా లాంటివి కట్టిస్తామంటున్నారని ఆయన విమర్శించారు. స్థానికతను వివాదం చేశారని, సంక్షేమపథకాలకు నిధులు కోత పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కూల్చడం ఆలోచనలు తప్ప మరోటి చేయడంలేదన్నారు.