సర్కార్ లక్ష్యాన్ని దెబ్బతీయలేరు
కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం
ఆదిలాబాద్,అక్టోబర్7 జనం సాక్షి రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎంపి గోడం నగేశ్ అన్నారు. కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులపైనా కాంగ్రెస్ ముందునుంచీ కుట్రలు చేస్తూనే ఉందని అన్నారు. కోటి ఎకరాల మాగాణమే తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగాలన్న లక్ష్యాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరని సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇటీవల వరుసగా పరాజయాలతో కాంగ్రెస్‌లో కలవరం మొదలయ్యిందన్నారు. హుజూర్‌నగర్‌లో కూడా మళ్లీ టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని వారే చెప్పుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తప్ప మరొకరికి అవకాశం లేదన్నారు. కాళేశ్వరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్టాన్న్రి సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమయన్నారు. ఆర్టీసీని నట్టేట ముంచిన కాంగ్రెస్ ఇప్పుడు కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు పండగపూట సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రిబ్బందుఉల కలిగించడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పాలేరు, పాలెంవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులను ఆధునికీకరించటం ద్వారా మూడు జిల్లాలో 45వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ
ఎకరానికి సాగునీరు అందించటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 24 గంటల కరెంట్‌తో పాటు రైతులకు సాగునీరు అందించాలనే మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కోయలసాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులతో పాటు ఖమ్మం జిల్లాల్లోని పాలేరు, బూపాలపల్లి జిల్లాల్లోని పాలెంవాగు, భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు. పాలేరు, పాలెంవాగు, కిన్నెరసాని ప్రాజెక్టులను ఆధునీకరించటం ద్వారా మూడు జిల్లాలో 45వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు. పది ఏళ్లుగా ఫారెస్ట్ క్లీయరెన్స్‌తో పెండింలో వున్న కిన్నెరసాని ప్రాజెక్టుపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి అనుమతులను మంజూరు చేశారని తెలిపారు. కిన్నెరసాని కాలువల ద్వారా సాగు చేసే రైతులు నీటిని జాగ్రత్తగా వాడుకొని ఆర్ధికంగా ఎదగాలని అన్నారు.