సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామిక రాజ్యం కోసం పోరాడుదాo
కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు
రామన్నపేట ఆగస్టు 18 (జనం సాక్షి) సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో శ్రామికరాజ్యం కోసం పోరాటం చేద్దాం అని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు భావండ్లపల్లి బాలరాజు అన్నారు. బుధవారం ప్రభుత్వ అతిథి గృహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 362 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగినది.
ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు భావండ్లపల్లి బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2022 ఆగస్టు 2 నుండి 18 వ తారీఖు వరకు గ్రామ గ్రామాన సామాజిక చైతన్య యాత్రలు చేసి సమావేశాలు నిర్వహించుకుంటున్నామని కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాడి అమరులైన బొమ్మ గోని ధర్మ బిక్షం, బైరు మల్లయ్య ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ మొగలు చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాడి గోల్కొండ కోటను జయించిన సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పని చేస్తూ పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోగలుగుతామని తెలిపారు. సామాజిక ఆర్థిక సమానత్వం కోసం పోరాడి శ్రామిక సాధ్యం సాధించడమే పాపన్నకు ఇచ్చే ఘనమైన నివాళులని రాష్ట్రంలో ఉన్న కల్లుగీత కార్మిక సమస్యలు పరిష్కరించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి ,గీత బంధు ప్రకటించి ప్రతీ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలి, ప్రతి జిల్లాలో నీరా ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేయాలని దశలవారీగా మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక పారిశ్రామిక అధ్యక్షుడు గోపగోని మీనయ్య, బాలగోని నరసింహ, పొలగోని స్వామి, ఎర్ర రవీందర్, వీరమల్ల ముత్తయ్య, భావండ్లపల్లి సత్యం, పబ్బతి ఆంజనేయులు, ఎర్ర నరసింహ, బోయపల్లి శంకరయ్య, రామలింగయ్య, ఎర్ర దేవయ్య, బొడిగె లక్ష్మయ్య, బోయపల్లి శ్రీను, పొట్లపల్లి మురళి, బాలగోని శ్రీను తదితరులు పాల్గొన్నారు.