సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం…
ముఖ్య అతిథులుగా ఎంపీపీ చంద్రమోహన్, జెడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి
అక్టోబర్ 8 జనం సాక్షి / ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదికలో స్థానిక సర్పంచ్ దార్ల రామ్మూర్తి ఆధ్వర్యంలో శనివారం రోజున జరిగిన నూతన పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఓలం చంద్రమోహన్,జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి హాజరై ఇటీవల నూతనంగా పెన్షన్ ముంజూరైన వారికి మంజూరు పత్రాలు,పెన్షన్ కార్డులను పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవేందర్,తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు బేతమల్ల చంద్రయ్య,తెరాస నాయకులు బొబ్బిలి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Attachments area