సర్వజన శ్రేయస్సే సర్కారు లక్ష్యం
– అధికారక క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్: సర్వజన శ్రయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ముఖ్యంత్రి కేసీఆర్ తెలిపారు. నిజాం కాలేజీ మైదానంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి రాష్ట్ర ప్రజలకు, క్రిస్టియన్ సోదర,సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చిన్నారులకు గిప్ట్‌లు ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవ సోదరుల సమస్యలు తనకు తెలుసునని వాటిని త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జెరూసలెం వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.క్రైస్తవుల సమాధుల కోసం స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. జనవరి మొదటి వారంలో బిషప్‌లతో సమావేశం నిర్వమిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.రాష్ట్రఅభివృద్ధిలో క్రైస్తవులు బాగాస్వామ్యం కావాలని సీఎం పిలుపు నిచ్చారు. దళిత క్రైస్తవ సమస్యలను పార్లమెంట్ వేదికగా లేవనెత్తి పరిష్కరించేందుకు పార్టీ తరపున కృషి చేస్తానన్నారు. ఎక్కువ మంది క్రైస్తవ సోదరులు జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హావిూ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో కేసీఆర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిజాం కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో సీఎం కేసీఆర్ తోపాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి,ఎంపీ కేకేశవరావు, మంత్రులు జితేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు పాల్గొన్నారు.