సలార్ చిత్రంపై పెరుగుతున్న అంచనాలు
ప్రభాస్ పార్ట్ చిత్రీకరణ పూర్తి అయినట్లు టాక్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ’సలార్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. హై యాక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా అభిమానులకు ఈ సినిమా మాస్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ’కేజీఎఫ్’ సీరిస్ తో దర్శకుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశాంత్ నీల్ గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ’సలార్’ పై మరింతగా హైపు క్రియేట్ అయింది. ఇందులోని ప్రభాస్ లుక్, మేకవర్‌కు సంబంధించిన ఫోటోలు పలు మార్లు లీకయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ’సలార్’ చిత్రంలోని ప్రభాస్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే పూర్తికానుందట. అలాగే.. త్వరలో జరగబోయే షెడ్యూల్‌తో చిత్రం టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అవుతుందని టాక్. రానున్న ఈ షెడ్యూల్‌లో ఒక లోయ బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించ
బోతున్నారట. ఇంకా ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ పై ఛేజింగ్ సీన్స్ కూడా తీయబోతున్నారట. వీటితో పాటు సముద్రగర్భంలో తీసిన యాక్షన్ పార్ట్ చిత్రానికే హైలైట్స్ కానున్నాయని సమాచారం. బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ’కేజీఎఫ్’ తరహా యాక్షన్ బ్లాక్స్‌తో అభిమానులకు బోలెడన్ని సర్ ప్రైజులు రెడీ చేస్తున్నారు. ’సాహో’ తర్వాత మళ్ళీ ప్రభాస్ నుంచి ఈ తరహాలో యాక్షన్ సీక్వెన్సుల్ని అభిమానులు మిస్ అయ్యారు. సలార్’ వారి కోరిక తీరుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్నిర్మాణంలో ’సలార్’ చిత్రం తెరకెక్కుతోంది. రవిబస్రూర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ’కేజీఎఫ్’ తరహాలోనే డార్క్ సెంట్రిక్ థీమ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.