సవాళ్ల పర్వంలో ఉంది అనేక సాహసాల యాత్ర జీవితం ఇప్పుడు
చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్టు 27) : అశ్వారావుపేట నియోజకవర్గంలో సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ అభిమానుల ఆసక్తి కర చర్చలు సాగుతున్నాయి. సంక్షేమ పథకాల కార్యక్రమాలలో ఎమ్మెల్యే రేసులో ఉన్న జారే ఆదినారాయణ పేరు బయటకు రాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారంటూ అభిమానుల చర్చలు జోరందుకున్నాయి. ఈ చర్చకు గల కారణాలు ఇలా ఉన్నాయి ఇటీవలే చండ్రుగొండ మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అశ్వరావుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. అయితే ఎంపీ నామా చొరవతో జారే కృషి వల్ల చెక్కులు త్వరగా వచ్చాయని ఆదినారాయణ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఆ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారని ఆ సమయంలో జారే అక్కడే ఉన్నప్పటికీ ఆయన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడ్డారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తితో సొంతగూటిలోనే ప్రస్తుతం తెరచాటు వర్గ విభేదాలు సాగుతున్నాయని తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ విభేదాలు తెరపైకి రానున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయం లో నియోజకవర్గం వ్యాప్తంగా జారే వల్ల వందల మంది పేదలకు లబ్ధి చేకూరిందని ఇంతటి కష్టం వెనుక జారే కృషి ఉందని ఆయనతోనే సాధ్యపడిందని స్వయంగా లబ్ధిదారులే చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నా పేదల ఇండ్లకు వెళ్లి పరామర్శించడం వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తో ప్రస్తుతం జారే అంటే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చెప్పుకోవడం గమనార్హం