సస్య రక్షణ చర్యలపై రైతులకు అవగాహన
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రైతు వేదిక నాగారం గ్రామంలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి అజ్మీర సురేష్, కృషి విజ్ఞాన కేంద్రం మృతిక శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి రైతు వేదిక నందు ప్రస్తుతం వరి, పత్తి, కూరగాయ పంటలు వాటిలో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. రైతుల ఆసక్తి మేరకు డాక్టర్ కిరణ్ పిల్లి నానో యూరియా వాడకం దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివిధ పంటలలో రైతులకు వివరించారు. తరువాత రైతుల పొలాలను సందర్శించి తగిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ప్రస్తతం పత్తి పంట లో రసం పీల్చు పురుగు( పచ్చ దోమ ,పెనుబంక)నివారణకై ధయోమిధాక్సం 0.2 గ్రామ్ లేదా డైపెంత్యురన్ 0.25 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.దీంతో పాటుగా వేప నూనె 1500 పి పి యం నీటికి 5 మిల్లీలీటర్లు తప్పని సరిగా పిచకరి చేసుకోవాలి అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అజ్మీర సురేష్ , కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి రైతు వేదికలో నిర్వహించి రైతులకు వివిధ అంశాలపై అవగాహనపాల్గొన్నారు కల్పిస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ చొప్పరి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు.