సహకార ఎన్నికలకు మారిన షెడ్యూల్‌


జనవరి 31, ఫిబ్రవరి 4న రెండు విడతల్లో ఎన్నికలు

హైదరాబాద్‌,  డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : సహకార సంఘాల ఎన్నికల షెడ్యూలను ప్రభుత్వం సవరించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలును రివైజ్‌ చేస్తూ ఆదేశాలించ్చింది. ప్రాథమిక పరపతి సహకారలు సంఘాలకు జనవరి 4న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తాజా షెడ్యూల్‌లో ప్రకటించారు. తొలిత జనవరి. 21, 25 తేదీల్లో ఎన్నికలు నిర్వహించలని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలోకి తీసుకున్న ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూలును సవరిస్తూ తాజా షెడ్యూలు ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంబించేందుకు ఈ నెల 21న

ఎన్నికల అధికారులను నియమించనున్నారు. రాష్ట్రంలో 2949 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగానున్నాయి. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసునేందుకు ఈ నెల 21న చివరి గడువు తేదీగా ప్రకటించారు. వ్యవపాయదారులతో పాటు కౌలుదారులు మూలధనం వాటా రూ..300 చెల్లించి ఓటరుగా నమోదు కావచ్చని తెలిపారు. ఓటరు నమోదులో ఏవైనా సమస్యలుంటే ఆయా జిల్లాల్లోని డివిజన్‌ సహకార శాఖాధికారులును సంప్రదించాలని సూచించారు.

ఇప్పటికీ రుణాలు పొందిన రైతులు ఓవర్‌ డ్యూ ఏడాది దాటిటే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోనున్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది సహకార  సంఘాల ఓటర్లు ఉన్నారు. 22 జిల్లాల్లో  ఫబ్రవరి 13 జిల్లా  సహకార సంఘాలకు, ఫిబ్రవరీ 22న ఆష్కాబ్‌కు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు షడ్యూల్‌లో ప్రకటించారు.సహకార సంఘాల ఎన్నికలు గడువు 2010 అక్టోబర్‌ 25తో ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా దఫా దఫాలుగా పొడిగిస్తూ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14కు ఈ గడువు ముగియనుంది.