సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం

మెట్‌పల్లి గ్రామీణం: సహచట్టం అవినీతిపై పాశుపతాస్త్రం అని న్యాయవాది పుప్పాల భానుమూర్తి పేర్కొన్నారు. మండలంలోని వేంపేట గ్రామంలో ‘ఈనాడు-ముందడుగు’ ఆధ్వర్యంలో సహచట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సహచట్టంపై అవగాహన పెంచుకుని అవినీతి రహిత సమాజానికి కృషిచేయాలన్నారు. ముందడుగు సమన్వయ కర్త రాజేందర్‌ సహచట్టంపై పలువురడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు తొగిటి రాజశేఖర్‌, వేల్పుల శంకర్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.