సహరా చీఫ్‌కు ఊరట
న్యూఢిల్లీ జులై 11 (జనంసాక్షి): సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ పెరోల్‌ను సుప్రీం కోర్టు ఆగస్ట్ 3 వరకు పొడిగించింది. ఆ గడువులోగా రూ.300 కోట్లను జమ చేయాలని ఆదేశించింది. మానవతా దృక్పధంతో పొడిగించిన పెరోల్‌ను దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. 2007, 2008లో సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు ఖాతాదారుల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించాయి. దీనిపై కేసులు నమోదుకాగా రూ.17,600 కోట్లను 15 శాతం వడ్డీతో ఖతాదారులకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.దీనిపై స్పందించకపోవడంతో 2014 మే 4న సుబ్రతారాయ్‌ను సుప్రీం కోర్టు జైలుకు పంపింది. ఆయన తల్లి చనిపోవడంతో ఈ ఏడాది 6న పెరోల్‌పై విడుదల చేసింది. మే 11న దాన్ని రెండు నెలల పాటు పొడిగించగా ఆ గడువు జులై 11తో ముగిసింది. సోమవారం దీన్ని సవిూక్షించిన సుప్రీం కోర్టు పెరోల్‌ను ఆగస్ట్ 3 వరకు పొడిగించింది.