సహారా ఇండియా ఆధ్వర్యంలో జాతీయగీతాలాపన
బెల్లంపల్లి పట్టణం : దేశవ్యాప్తంగా ‘భారత్ భావనా దివన్’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ఏఎంసీ మైదానంలో జాతీయగీతాపన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐక్యతను పెంపొందించడానికి ఈ గీతాలాపన తోడ్పడుతుందని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం జె. నాగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి.సత్య నారాయణ, బెల్లంపల్లి సహారా బ్రాంచి మేనేజర్ ముకుందలాల్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనందరావు, సీనియర్ పీవో రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.