సాగర్‌నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల

విజయవాడ: ఈ రాత్రికి నాగార్జునసాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల చేయనున్నట్టు కృష్ణాడెల్టా ఎస్‌ఈ నర్సింహమూర్తి తెలియజేశారు. సాగర్‌నుంచి దాదాపు 7,500 క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు, కృష్ణాడెల్టాకు సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు ఎస్‌ఈ చెప్పారు.