సాతారం శ్రీమంతుడు.. డాక్టర్ గండ్ర విద్యాధరరావు. సొంత ఇల్లుnu స్కూల్ భవనానికి ఇచ్చిన.
మల్లాపూర్ (జనంసాక్షి )డిసెంబర్: 07 మండలంలోని సాతారం. గ్రామంలో ఎన్ఆర్ఐ డాక్టర్ గండ్ర విద్యాధర్ రావు ఆర్థిక సాయంతో మంగళవారము ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ మాట్లాడుతూ ఓపెన్ జిమ్, వైకుంఠరథ ఐదు లక్షల ఆర్థిక సహాయం ఇచ్చినందున మరియు గత పది సంవత్సరాల నుండి పదవ తరగతిలో మెరిట్ సాధించిన విద్యార్థులకు పదివేల రూపాయలు అందజేస్తున్నందున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాకుండా మన సాతారం శ్రీమంతుడని వారు ఆయనను పొగిడారు 1991 ఒక కిలోమీటర్ సిసి రోడ్డు, వాటర్ ప్లాంట్ , గ్రామంలోని ఇరువైపులా చెట్లను నాటించారు వారి సొంత ఇల్లు ను స్కూల్ బిల్డింగు ఇచ్చారు అలాంటివారు మన ఊరి వారైనందుకు మనకు ఎంతో గర్వకారణమని ఎంపిటిసి గున్నల శ్రీనివాస్ అన్నారు. ఉప సర్పంచ్ మెడకోకుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామానికి ట్రాక్టర్ ,4 గదులను నిర్మించి ఇచ్చారు అలాగే కాకుండా మరెన్నో సాతారాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని గ్రామానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తన వంతు సహాయం చేయాలని డాక్టర్ విద్యాధర్ రావును కోరారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కావాలని కోరడంతో ఇస్తానని ఆయన అన్నారు. అనంతరం విద్యాధరరావు మాట్లాడుతూ గ్రామాన్ని ఏ పార్టీలకు అనుకూలంగా లేకుండా మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. అనంతరం విద్యాధర్ రావు నీ పూలమాలలతో శాలువాల తో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు విద్య కమిటీ మెంబర్లు ఆయనను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామాసర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్, ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, వార్డుసభ్యులు, వి యస్ జీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ బొడ్డు రాజేష్, విడిసి చైర్మన్ గడ్డం హన్మంత్ రెడ్డి,స్కూల్ యజమాన్యకమిటి చైర్మన్ లు ఒడ్డె లత శేషు, మైధం రాజారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయులు, నాయకులు మురళి,శ్రీను, బాలు,తదితరులు పాల్గొన్నా