సాధారణ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయి. : కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం సాధించడంపై తెరాస అధినేత కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. అందరి వూహలను తలకిందులు చేస్తూ ఆర్టీసీలో గులాబీ జెండా రెపరెపలాడిందని అన్నారు. ఇవే ఫలితాలు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు, బొత్స, లగపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా తెలంగాణ కూటమి విజయం సాధించిందన్నారు. ఈ నెల 28న నిర్వహించే అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్‌, తెదేపా, వైకాపాలు అభిప్రాయం చెప్పినా , చెప్పకపోయినా ఆ పార్టీలను  ఎవరూ నమ్మరని స్పష్టం చేశారు. మిగతా పార్టీలు అభిప్రాయం చెబితేనే తాము చెబుతామన్నా బొత్స వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు.