సానియాకు ఖేల్‌రత్న
న్యూఢిల్లీ,ఆగస్టు 11(జనంసాక్షి):
ఇండియన్ టెన్నిస్ క్వీన్ సానియా విూర్జా….2014- 15 సంవత్సరానికి దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైంది. ఈ అవార్డు కోసం సానియా పేరును గత వారమే కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ పురస్కారం కోసం స్క్వాష్ స్టార్ దీపకా పల్లికల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టార్లు వికాస్ గౌడ, సీమా పూనియా,భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్, బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబీ శ్రీకాంత్‌ల పేర్లు ప్రకటించినా..అవార్డు కమిటీ సభ్యులు మాత్రం సానియా పేరునే ఖరారు చేశారు. ప్రపంచ మహిళల డబుల్స్ నెంబర్ వన్ ర్యాంక్ తో పాటు..మార్టీనా హింగిస్ తో జంటగా ప్రతిష్టాత్మక వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్స్ సాధించడం ద్వారా సానియా చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా అరుదైన రికార్డు నమోదు చేసింది. సానియా ఇప్పటికే అర్జున అవార్డుతో పాటు పద్శ శ్రీ పురసార్కాన్ని సైతం అందుకున్న సంగతి తెలిసిందే. సానియాకు ఖేల్ రత్నపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.