సానుభూతి, సెంటిమెంట్‌ తాత్కాలికమేనని రుజువు చేశారు

తెదేపా నేత పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : అవినీతి ఆరోపణలు ఉన్న వారికి ప్రజల మద్దతు ఉండదని కర్ణాటక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ మన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. సానుభూతి, సెంటిమెంట్‌ తాత్కాలికమేనని కర్ణాటక ఓటర్లు రుజువుచేశారని అన్నారు.