సాఫీగా జరిగిన గ్రూప్-2 పరీక్షలు
కర్నూలు, జూలై 21: ఉద్యోగాల నియామకం కోసం శనివారం నిర్వహించిన గ్రూప్ – 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ సుదర్శన్ రెడ్డి అన్ని పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేశారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ జిల్లా, ఎస్‌పి, డిఆర్‌ఒ, ఆర్డీఓ, తహసీల్ధారు స్థాయి అధికారులు ఒక్కొక్క పరీక్షకేంద్రాన్ని అన్వేషించారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు సరిగా ఉండటంతో వారు సంతృప్తి వ్యక్తం చేశారు.