సామాజిక తరగతులను అణిచివేస్తు దోపిడీ చేస్తున్న బూర్జువా పార్టీలు

ప్రజాస్వామ్య పరిరక్షణకై అధిక ధరలు, దోపిడి విముక్తికై ఉద్యమాలు ఉధృతం చేయాలి
ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తు నైతిక విలువలను, ప్రజా సమస్యలను గాలికి వదిలి ఓట్లు సీట్లు అధికారం దోపిడే లక్ష్యంగా బిజెపి టీఆర్ఎస్ పార్టీలు పాలన కొనసాగిస్తున్నారని ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే మునుగోడు ఉప ఎన్నిక అని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్దారపు రమేష్, జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి అన్నారు.
    ఈరోజు అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 14వ వర్ధంతి పక్షోత్సవాల ముగింపు సందర్భంగా నర్సంపేట పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి స్థానిక ఓంకార్ భవన్ లో డివిజన్ కార్యదర్శి మహ్మద్ రాజా సాహెబ్ అధ్యక్షతన జరిగింది.
 దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ మచ్చలేని మహా నాయకుడు కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన యావత్తు రాష్ట్ర పేద ప్రజల గొంతుకగా అసెంబ్లీలో గొంతు వినిపించి అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచినారని ఏలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ప్రాణాలను సైతం లెక్కచేయక కష్టజీవుల పక్షాన నిలబడిన గొప్ప మార్క్సిస్టు నాయకుడని ఆయన లేని లోటు స్పష్టంగా కనబడుతున్నదని, ప్రస్తుత రాజకీయాలు నైతిక విలువలు లేకుండా సామాజిక స్పృహ కోల్పోయి గెలవడమే లక్ష్యంగా అనేక తప్పుడు పద్ధతులతో బిజెపి టిఆర్ఎస్ లాంటి  బూర్జువా పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు ఓంకార్ గారు ప్రజలు ఇచ్చిన ఆర్థిక సహకారంతో కేవలం 50వేల రూపాయల ఖర్చు మాత్రమే ఎన్నికల్లో ఖర్చు చేస్తే ఒక్క ఓటు కే అంత డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇంతకంటే దిగజారిన రాజకీయాలు మరొకటి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పాలకుల విధానాల మూలంగా ధరలు అధికంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితి, పెరిగిన ఉత్పత్తి ఖర్చులతో రైతాంగం పండిన పంటకు సరైన ధర లేక అప్పులపాలై ఆత్మహత్యలు జరుగుతున్న ప్రజలందరికీ చెందాల్సిన సహజ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళుతున్న కనీస పట్టింపు లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సామాజిక న్యాయ సాధనకై ఓంకార్ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
  ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మంద రవి కుసుంబ బాబురావు వంగల రాగసుధ నాగెల్లి కొమురయ్య  డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి జిల్లా నాయకులు సింగతి మల్లికార్జున్ కేశెట్టి సదానందం కలకోట్ల యాదగిరి గట్టిగ జమున జన్ను రమేష్ దామ సాంబయ్య మార్త నాగరాజు గూడ సాయిరాం కంకణాల మల్లికార్జున్ మంద బాబు గుగులోత్ అరుణ్ నాయక్ చల్లేటి సీతారాములు అనుమాండ్ల రమేష్ సిరి బొమ్మల భాస్కర్ కొమురయ్య గాజుల వెంకటయ్యలతొపాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో కామ్రేడ్ కొత్తకొండ రాజమౌళి ఆటపాటలతో అలరించారు.

తాజావార్తలు