సామాజిక సేవలో లయన్స్ క్లబ్ ముందంజలో ఉంది..

-లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్..
దండేపల్లి. జనంసాక్షి అక్టోబర్02 సామాజిక సేవలో ప్రపంచ స్థాయిలో నే లయన్స్ క్లబ్ ఉందని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రిక్కల నారాయణ రెడ్డి అన్నారు. ఆఫీషల్ విజిట్ లో భాగంగా ప్రత్యేక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ నిర్వహించి అనంతరం పెండ్లి మడుగు లోని నిరుపేద ఆదివాసీ గిరిజనులకు ఉచిత దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ ఉదారి చంద్ర మోహన్ గౌడ్,డిస్ట్రీక్ట్ కేబినెట్ సెక్రెటరీ నారాయణ రావు, దండేపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాబు సుగుణాకర్, బొలిశెట్టి రాజన్న, కోశాధికారి మాదంశెట్టి మల్లిఖార్జున్, లయన్స్ క్లబ్ సభ్యులు అన్నం సత్యనారాయణ, కుంచె కిషన్,పాత రమేష్,శ్రీనివాస్,కొత్త శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.