సామాన్యుల అభ్యున్నతే లక్ష్యంగా రాజకీయ పార్టీ : కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ తాను త్వరలో ప్రారంభించపోయే పార్టీ పేరును నేడు ప్రకటించనున్నారు. సామాన్య ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పార్టీ ఆవిర్భావం ఉంటుందని ఆయన ఢిల్లీలో తెలియజేశారు. దేశవ్యాప్తంగా 350 మంది సభ్యులతో జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సుస్వరాజ్య స్థాపనే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తుందని చెప్పారు. రెండు నెలల క్రితమే రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. తన మద్దతుదారులతో నేడు ఢిల్లీలో కేజ్రీవాల్ భేటీ అయి పార్టీ పేరు, కార్యవర్గం రూపురేఖలపై నిర్ణయం తీసుకోనున్నారు.