సాయి కృప డిగ్రీ పిజీ విజేతలకు బహుమతి ప్రధానం…

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):—మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల మరోసారి విజేతలుగా ప్రభంజనం సృష్టించింది. ఐదవ సెమిస్టర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన మా ఆణిముత్యాలు ఎంపీసీఎస్ విభాగం నుంచి జే .నందిని బీ. జెడ్.సి విభాగంలో జి. సుస్మిత బి.కాం విభాగంలో డి. శిరీష సిహెచ్ .గౌతమి పి .అఖిల బి. ఏ విభాగం నుంచి జిన్న. మాధవి ఈ. నాగరాణి మరియు మూడవ సెమిస్టర్ ఫలితాలలో మంచి ఫలితాలు సాధించిన మా విద్యా కుసుమాలు సైన్స్ విభాగంలో పి. రవళి, డి. రమ్య మరియు కామర్స్ విభాగంలో బి .స్వాతి, జి. మానస. ఆర్ట్స్ విభాగం నుంచి బి. పూజ, బి.సంధ్య, వి.శిరీష వీరు యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చైర్మన్ శ్రీ దరిపల్లి నవీన్ కుమార్ సార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని కొనియాడారు. తదనంతరం శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ శ్రీ దరిపల్లి  ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యూనివర్సిటీ ర్యాంకులు తెచ్చి మన కళాశాలకు పేరు తెచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం జరిగే సెమిస్టర్ ఫలితాలలో అత్యధిక ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మరియు కరస్పాండెంట్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను అందించి విద్యార్థులకు స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో  శ్రీ సాయి కృప డిగ్రీ & పిజి కళాశాల ప్రిన్సిపల్ ఎండి యాకుబ్ బాబా,  వైస్ ప్రిన్సిపల్ పి రాము, కామర్స్ అధ్యాపకులు కొలను శ్రావణ్ కుమార్ రెడ్డి, జి మహేందర్, మరియు అధ్యాపక బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.