సారంగాపూర్, ఆగస్టు 29, జనం సాక్షి….,

ఈరోజు  యాకర్పల్లి గ్రామం, సారంగపూర్ మండలంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ రూరల్ సీఐ బి. వెంకటేష్ , సారంగపూర్ ఎస్ ఐ కృష్ణ సాగర్ రెడ్డి, నర్సపూర్ ఎస్ ఐ గీతా, నిర్మల్ రూరల్ ఎస్ ఐ చంద్ర మోహన్, ఏ ఎస్ ఐ  లు మరియు సిబ్బంది 20 మంది వరకు పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నిబందనలు, మహిళల చట్టాలు (పొక్సో),   మరియు గణేష్ ఉత్సవ కార్యక్రమం సత్వర నిబంధనలు గురించి వివరించడం జరిగింది. ఇందులో భాగంగా 25. వాహనాల యొక్క డాకుమెంట్స్ తనిఖీ చేసి ఓల్డ్  ఛాలెన్స్ కట్టించి మరియు డాక్యుమెంట్స్ లేని వాహనాలకు చాలాన్స్ వేయడం జరిగింది.