సార్వత్రిక ఎన్నికలకు సిద్దంకండిసార్వత్రిక ఎన్నికలకు సిద్దంకండి

ఇందిర హయాం కన్నా బిజెపికే ఎక్కువ రాష్టాల్రు
2 సీట్లతో మొదలుపెట్టి  అజేయశక్తిగా  ఎదిగాం
పార్లమెంటరీ పార్టీ భేటీలో మోడీ ఉద్విగ్న ప్రసంగం
మోడీని చప్పట్లతో అభినందించిన పార్టీ సభ్యులు
న్యూఢిల్లీ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): 2019 ఎన్నికల సమయానికి నేతలు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇందిరా కాంగ్రెస్‌ కంటే కూడా బీజేపీయే ఉన్నతంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 18 రాష్టాల్ల్రో  కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే, తాజా ఫలితాలతో  19 రాష్టాల్ల్రో బీజేపీ పాగా వేసిందన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో గెలుపుతో మొత్తం 19 రాష్టాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు. 1984 కేవలం రెండు సీట్లతో ప్రయాణం ప్రారంభించిన బీజేపీ.. నేడు అజేయ శక్తిగా ఎదిగిందని ఉద్వేగానికి గురయ్యారు. అహంకారం ప్రదర్శించొద్దని హితవు పలికారు. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం బుధవారం జరిగింది. పార్లమెంట్‌లోని లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, సుష్మాస్వరాజ్‌ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోదీ హాల్‌లోకి రాగానే.. పార్టీ నేతలంతా నిల్చుని జయ జయధ్వానాలు చేశారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో మోదీ నాయకత్వాన్ని అభినందించారు. అనంతరం ప్రధాని మోదీ, అమిత్‌షాను నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ దేహం దేశానికే అంకితమంటూ ఉద్విగ్నంగా చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘ఇదో పెద్ద విజయం. ఇప్పుడు మనం 19 రాష్టాల్ల్రో  అధికారంలో ఉన్నాం. మాజీ ప్రధాని ఇందీరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ 18 రాష్టాల్లోన్రే అధికారంలో ఉంది.’ అని మోదీ అన్నారు. అధికారమనేది ప్రజల కోసమే.. వారిని సంతోష పెట్టడానికే అని ఆయన చెప్పుకొచ్చారు. తన నుంచి ఇంకా ఎంత పని ఆశిస్తున్నారో అంత తీసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ విూడియాతో మాట్లాడుతూ  సమావేశంలో ప్రధాని చేసిన ప్రసంగాన్ని విూడియాకు వివరించారు. ప్రతిపక్షాలు చేసే అనవసరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని.. అవన్నీ అసంబద్ధమైనవి అని మోదీ చెప్పారని అనంత్‌కుమార్‌ అన్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ముఖ్యమంత్రుల ఎంపిక అజెండాగా ఈ సమావేశం జరిగింది. గుజరాత్‌లో నైతిక విజయం తమదేనంటూ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శల్ని అనంతకుమార్‌  తిప్పికొట్టారు. ప్రజాతీర్పును రాహుల్‌ అవమానిస్తున్నారంటూ కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ మండిపడ్డారు.  హిమాచల్‌ ప్రదేశ్‌లో భాజపా నాలుగింట మూడొంతుల ఆధిక్యంతో విజయం సాధించింది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భాజపా గుజరాత్‌లో సిక్సర్‌ కొట్టింది. మేము వరుసగా ఆరోసారి ప్రజల ఆశీర్వాదం పొందాము. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ అధికారం నిలబెట్టుకోలేకపోతోంది. ప్రజలకు ఎవరిపై విశ్వాసం ఉందో ఇది స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం… కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌గాంధీ విశ్వసనీయత అత్యంత కనిష్ఠస్థాయి దిగజారింది. మోదీ విశ్వసనీయత భారత్‌లోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయికి చేరింది అని అనంతకుమార్‌ తెలిపారు.