సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరిక్షలు 29 నుండి

గణేశ్‌నగర్‌ న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ వార్షిక పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహయ సంచాలకులు డాక్టర్‌ ఇ.రాజేందర్‌ రెడ్డి ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం పరీక్షలు 29నుంచి మే 4 వరకు. ప్రథమ సంవత్సరం మే 6 నుంచి 9 వరకు. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే 11 నుంచి 16 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష సమయమని చెప్పారు.