సింగరేణిలో మరణ మృదంగం…!

గోదావరిఖని, ఆగస్టు 11 (జనంసాక్షి) : సింగరేణి కాలరీస్‌ రామగుండం రీజియన్‌లో మరణ మృదంగం తేరలేసింది. వరస క్రమంలో జరుగుతున్న ప్రమాధ ఘటనలు కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఏ బొగ్గుగనిలో ఎప్పడు… ఏ ప్రమాధం సంభవిస్తుందోనని ఓవైపు అధికారులు మరో వైపు కార్మికులు జంకుతున్నారు. పనిస్ధలాల్లో రక్షణ సూత్రాలను సక్రమంగా అమలు పర్చకపోవడం వల్లేనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అనే ఆరోపణాలు కార్మిక సంఘాల నుంచి సర్వత్రా ఉన్నాయి. జీడీకే-2 ఇంక్లయిన్‌ ఎరుకల కిష్టయ్య అనే కోల్‌కట్టర్‌ అనే కార్మికుడు గనిపై కప్పుకూలి దుర్మరణం చెందిన ప్రమాధ ఘటనను మారిచిపోక ముందే తాజాగా శనివారం జీడీకె-5, 7ఎల్‌పీ బొగ్గుగనులో జరిగిన గని ప్రమాధంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. 5వ బొగ్గుగనులో 40సీమ్‌ పని స్ధలంలో బొగ్గు సైడ్‌వాల్‌ కూలడంతో.. కోల ప్రభాకర్‌ (50) తీవ్రంగా గాయిపడ్డాడు. ఐతే… అతను ప్రక్కకు జరగడంతో ప్రాణాపాయంతో బయట పడగా.. మెడకు తీవ్ర గాయమైంది. స్ధానిక సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. అలాగే 7ఎల్‌పీ బొగ్గుగనిలో ప్రమాదం జరుగగా… ఈ ప్రమాధన్ని అదికారులు రహస్యంగా ఉంచటంతో తీవ్రంగా గాయపడిన కార్మికుని వివరాలు తెలియరాలేదు. ఈ క్రమం ఇలా ఉండగా కార్మికుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యం వల్ల ఓ కార్మికుని ప్రాణం గాలిలో కలిపిన ఉదంతం శనివారం స్ధానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వెలుగు చూసింది. మృతుని కుటుంబీకులు ప్రమీల, దీనేష్‌వర్మ తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. సరిగా 15ఎళ్ళ క్రితం 5వ ఇంక్లయిన్‌లో జరిగిన గని ప్రమాధంలో మోత మధునయ్య(50) అనే గని కార్మికుడు రెండు కాళ్ళు విరిగాయి. నయం అయిన తర్వాత 2వ ఇంక్లయిన్‌లో నర్వేస్‌ ఉద్యోగం ఇవ్వగా అక్కడ వచ్చే దుమ్ము, దూళితో మధునయ్యకు క్షయవ్యాధి వచ్చింది. దీంతో అతన్ని కొత్తగూండెంలో ఉద్యోగం నంచి అన్‌ఫిట్‌ చేస్తూ.. సింగరేణి మోడికల్‌ బోర్డు నిర్ణయం చేసింది. కొడుకుకు ఉద్యోగం కల్పించాలని సిఫారసు చేసింది. ఎమైందో కాని… రామగుండం ఏరియా సింగరేణి అధికారులు మళ్ళి మధునయ్యను ఫిట్‌ చేశారు. ఈ నేపధ్యంలో ఈ నెల 9న ఉదయం ఫిప్ట్‌కు వెళ్ళి వచ్చి అస్వస్ధతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా, అప్పడే మధునయ్యను మెడికల్‌ అన్‌ఫిట్‌ చేసి అతని కోడుకుకు ఉద్యోగం కల్పిస్తే తమ కుటుంబ రోడ్డున పడేది కాదని కుటుంబికులు బోరున విలపించారు. వారి రోధనలు పలుపురిని కంట తడిపెట్టించింది. ఇలాంటి సంఘటన మరెన్నోయని కార్మిక సంఘాలు ద్వజమెత్తుతున్నాయి.