సింగరేణి కె ఓ సి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

టేకులపల్లి, ఆగస్టు 14( జనం సాక్షి ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సి.ఇ.ఆర్. క్లబ్ టేకులపల్లి కాలనీ లో ఆదివారం మహిళలకు ముగ్గుల పోటీలను సింగరేణి యాజమాన్యం నిర్వహించింది.ఈ పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ పర్సనల్ అధికారి పసునూరి కృష్ణ మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలను హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఇల్లందు ఏరియా సి.ఇ.ఆర్. క్లబ్ జె.కె. కాలనీ నందు ఆగష్టు 15 న నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలలో జి.యం ఎం.షాలేము రాజు చేతుల మీదుగా బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు