సిఎం జగన్‌ పాలనకు అద్దంపట్టిన సర్వే


పాలనా వైఫల్యాల కారణంగానే ర్యాంకింగ్‌: ఎంపి
న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సిఎం జగన్‌ పాలనకు ఇండియా టుడే సర్వే అద్దం పట్టిందని ఎంపి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆయన పాన తీరు బాగోలేదనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదన్నారు. పట్టపగలు విద్యార్థి రమ్యశ్రీని ఒక ఉన్మాది అందరూ చూస్తుండగానే చంపేసిన ఘటనపై సిగ్గుపడాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఏపీలో స్కూల్‌ నడుపుకుంటు ఉండే ఇద్దరు టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యకు ఎవరు కారణం? దీనికి కారణమైన వారిని భగవంతుడు శిక్షిసాడని అన్నారు. అమ్మ ఒడికి ఇచ్చిన డబ్బులు నాన్న బుడ్డికి వెళ్తున్నాయని, రకరకాల స్కీమ్‌లు తీసుకొచ్చి ఇలాంటి వారి జీవితాలతో ఆడుకోవద్దన్నారు. ప్రైవేట్‌
టీచర్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదని, ప్రైవేట్‌ విద్యాశాలలు మూసివేస్తామని అంటున్నారని, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని సీఎం జగన్‌ చెబుతున్నారు.. ముఖ్యమంత్రికి మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. ఇండియా టుడే నిన్న సీఎంల ర్యాంకులను ప్రకటించిందని ఆ ర్యాంకింగ్‌లో సీఎం జగన్‌ లేరని, మూడు నెలల్లో జరిగిన సంఘటనలతో ర్యాంకింగ్‌ పడిపోయిందన్నారు. రాష్టంలో ఇసుక అక్రమ తరలింపులు జరుగుతున్నాయని, కృష్ణానదిలో 150 లారీల ద్వారా ఇసుక అక్రమ త్వకాలు చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. 150 లారీలు నేరుగా తెలంగాణకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకడం లేదన్నారు. ఉచితంగా దొరికే ఇసుకను రూ. 25 వేలు చేశారని, ఇది ప్రభుత్వ వైఫల్యమని, ఇసుక అంశంలో సర్కార్‌ పూర్తిగా విఫలమైందన్నారు. రాష్టం అప్పుల దివాళా అంచులోకి వెళ్ళిపోయిందని రఘురామ కృష్ణరాజు విమర్శించారు.