సిద్దిపేటకు గురు మహర్ధశ నడుస్తోంది

60unsyso
అందుకే మంత్రిని అయ్యా..అభివృద్ది చేస్తున్నా

ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ రావు

మెదక్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటకు గురు మహర్దశ నడుస్తోందని అందువల్లనే పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి హరీష్‌ రావు అన్నారు.  గురు మహర్దశ కారణంగానే తాను మంత్రిని అయ్యానని, కెసిఆర్‌ సిఎం అయ్యారని, విూరంతా ఓట్లేయడం వల్లనే ఇది సాధ్యమయ్యిందన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం పట్టణంలో వివిధ వార్డుల్లో పర్యటించి ప్రచారం చేపట్టారు.  ప్రతి ఇంటికెళ్లి ఒక్కొక్కరిని అప్యాయంగా పలకరిస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో  మాట్లాడారు.   సిద్దిపేట అంటే పతార ( పేరు )ఉందని దానిని నిలబెట్టుకోవాలంటే టిఆర్‌ఎస్‌కు ఓటేయాలన్నారు. విూరు ఎక్కడికి వెళ్లినా సిద్దిపేట నుంచి వచ్చామంటే మంచి గౌరవం ఉందని, విూ మంత్రి హరీష్‌ రావు మంచోడనే అంటారని అన్నారు. విూ పతార, నాపతార నిలవాలంటే సిద్దిపేటలో అన్ని వార్డుల్లో టిఆర్‌ఎస్‌ గెలవాలన్నారు. విూరు మాకు ఓటేసి పనులు చేయించుకోవాలన్నారు. ఇప్పటికే అనుక అభివృద్ది కార్యక్రమాలు చేశామని, ఇంకా చేస్తున్నామని అన్నారు.

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని మంత్రి ఓటర్లకు పిలుపునిచ్చారు. సిద్దిపేటకు అధిక నిధులు తీసుకువస్తే దుష్పచ్రారం చేసిన నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కులేదని మండిపడ్డారు. గాడిదకు గడ్డేసి బర్రెకు పాలుపిండితే రావన్నారు. టిఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే అభివృద్ది జరుగుతందన్నారు. సిద్దిపేటలో తాను చేసిన అభివృద్ధి పనులు మంత్రి హరీశ్‌రావు వివరించారు. జూన్‌ మాసంకల్లా 45 కోట్ల రూపాయలతో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి వ్యక్తికి 135 లీటర్ల నీటిని అందించే బృహత్తర పథకం కొనసాగుతుంది. ఏ మున్సిపాలిటీలో ఇవ్వని విధంగా ఇక్కడ ప్రతినిత్యం తాగునీటిని అందిస్తున్నాం. సిద్దిపేట పట్టణంలో పందులు లేకుండా చేసి వంద శాతం మరుగుదొడ్లు కట్టించి రాష్టాన్రికే ఆదర్శంగా నిలిచాం. రెప్పపాటు కరెంట్‌ పోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాం. సిద్దిపేట పట్టణం చుట్టూ విద్యుత్‌ వలయాన్ని ఏర్పాటు చేశాం. పట్టణ పేద ప్రజల కోసం 130 కోట్ల రూపాయలతో 2 వేల డబుల్‌ బెడ్‌ రూము ఇండ్లను నిర్మిస్తున్నాం.  పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు రూ. 75 లక్షలతో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దూరదృష్టితో 6 గ్రామాలను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడంతో పట్టణ జనాభా పెరిగి అమృత్‌ పథకం కింద రూ.100 కోట్లు మంజూరయ్యాయి. మొదటి విడత పనులు జరుగుతున్నాయి. సిద్దిపేట ప్రజల 50 ఏళ్లకళ కోమటి చెరువు సుందరీకరణ పనులు చేపట్టి మినీ ట్యాంకుబండ్‌లా తీర్చిదిద్దాం. పట్టణంలోని ఎర్రచెరువు, చింతల్‌చెరువుల సుంధరీకరణ పనులను చేపడుతున్నాం.  కార్పొరేట్‌ స్థాయిలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్ది పేద ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నాం. ముఖ్యంగా

నవజాత శిశుకేంద్రం, డయాలసిస్‌, ఐసీయూ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. నైట్‌ షెల్టర్స్‌ నిర్మాణం జరుగుతున్నాయి. ప్రశాంత్‌నగర్‌లో వైకుంఠధామం ప్రారంభించుకున్నాం. శ్రీరామకుంట్లలో శ్మశాన వాటికలో పనులు జరుగుతున్నాయి. పట్టణం చుట్టూ ఆరులైన్స్‌ రోడ్లు, హరితహారం, వార్డులోల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ఈ విధంగా సిద్దిపేట పట్టణంలో పలు అభివృద్ధి చేపట్టుకోవడం జరిగిందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని తెలిపారు.  ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి.. పట్టణ ప్రజలు బాగా ఆలోచించండి.. ఎన్నికల ముందు ఎవరెవరో వస్తారు.. ఏవెవో కల్లబొల్లి మాటలు చెప్తరు.. ఆ మాటలకు మోసపోవద్దు.. ఎన్నికల్లో ఎవరొచ్చినా ఏం చేయలేరు.. ఏం చేసినా మళ్లీ నేనే చేయాలి.. సిద్దిపేటకు ఇప్పటికే ఎంతో చేశా.. మున్సిపల్‌ ఎన్నికల్లో మద్దతివ్వండి.. మరింత అభివృద్ధి చేసే జిమ్మదారి నాదే అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీని రాష్టాన్రికే తలమానికంగా తీర్చిదిద్దానని, ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. విూ దీవెనలు, ఆశీర్వాదాలతోనే మంత్రినయ్యానన్నారు. సిద్దిపేటను అభివృద్ధి చేసే బాధ్యతను నాకప్పగించారని, విూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అందుకోసం విూ వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మరింత సులువుగా పనిచేయగలుగుతానని అన్నారు. సిద్దిపేటలో అందరం అన్నదమ్ముల్లాగా ఉంటున్నామని, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నామని భరోసానిచ్చారు. టికెట్ల పంపిణీ విషయంలో పార్టీ సవిూకరణాల దృష్ట్యా కొందరికి ఇవ్వలేకపోయామని, వారంతా స్వచ్ఛందంగా తప్పుకొని ఇవాళ పార్టీకి సేవ చేస్తున్నారని చెప్పారు. వారు నా కోరికను మన్నించి పార్టీ కోసం కృషి చేయడం శుభపరిణామమన్నారు.

తాజావార్తలు