సిద్ధిపేటలో ప్రమాదవశాత్తు కారు డోర్ లాక్: ఊపిరాడక చిన్నారి మృతి
మెదక్: కారులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు డోర్ లాక్ అయిన ఘటనలో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందాడు. సిద్ధిపేటలోని భరత్‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు లోకేష్ ఆడుకుంటూ పక్కనే ఉన్న కారులోకి వెళ్లాడు. ఆటలో మునిగిపోయిన బాలుడు డోర్ లాకైన విషయాన్ని గమనించలేదు. తర్వాత ఊపిరాడకపోవడంతో డోర్ తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరికి ఊపిరి అందక మరణించాడు. బాలుడి మరణంతో భరత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.