సినిమా ప్రచారం కోసం దర్గాకు రాకండి

అజ్మీర్‌(రాజస్థాన్‌): అజ్మీర్‌లోని ప్రఖ్యాత ఖ్యాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాకు సినీ ప్రముఖుల తాకిడి పెరుగుతుండటం పై దర్గా తీవ్రంగా స్పందించారు. ఎవరైనా సరే దురుద్దేశాలతో దర్గా సందర్శనకు రావడాన్ని తీవ్రంగా ఖండిస్తానని తెలిపారు. సినిమాలు విజయవంతం కావాలని ప్రార్ధిస్తూ సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు దర్గాకు వస్తుండటం, తద్వారా మీడియాలో ప్రచారం పొందుతుండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వారు వాణిజ్య ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారని ఆక్షేపించారు. చాలా వరకు నేటి సినిమాలు అశ్లీలతతో కూడి ఉంటున్నాయి. సమాజంపై, యువతరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సమాజంలో నైతిక విలువలు అంతకంతకూ దిగజారిపోతుండటానికి ఇదో ప్రధాన కారణం, నటులు, దర్శకులు, నిర్మాతలు. తమ సినిమాలకు ప్రచారం కల్పించుకోవడం కోసం… మతపరమైన ఈ ప్రదేశానికి (దర్గాకు) రావడం ఏ మాత్రం సహించరానిది. సీనీ ప్రముఖులు పదేపదే దీనికి విరుద్ధంగా వ్యవహరిస్నున్నారు. తమ సినిమాల విజయం కోసం దర్గాలో ఆశీస్సులు పొందేందుకు వచ్చి వారు అదే విషయాన్ని మీడియాలో ప్రచారం చేసుకొంటున్నారు. అని దర్గా దీవాస్‌ జైనుల్‌ అబ్దీన్‌ అలీ ఖాన్‌ ఆదివారమిక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. చాలా మంది సినీ నటులు, దర్శకులు, నిర్మాతల తీరు అభ్యంతరకరంగా ఉందని వారు కూడా అన్నారని చెప్పారు. పలువురు సినిమా వాళ్లు దర్గాలో ప్రార్ధన సందర్భంగా సీడీలు, డీవీడీలు కూడా సమర్పిస్తున్నారని, ఇది ఇస్లామిక్‌ చట్లానికి పూర్తి విరుద్ధమని వెల్లడించారు. సినిమా ప్రయోజనాల కోసం దర్గాకు రావడాన్నే తాను తప్పుబడుతున్నానని, సాధారణ సందర్శనలపై ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదని స్పష్టం చేశారు. ఇస్లాంలోనే కాదు, ఏ మతంలోనైనా మతవిరుద్ధ పనులను అనుమతించరాదని ఆయన పేర్కొన్నారు.

తాజావార్తలు