సిపిఎస్ ను రద్దు చేయాలి

టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి ): సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు గుగులోతు హరిలాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు సంకటంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ వలన తీరని నష్టం జరుగుతున్నదని 30 సంవత్సరాలకు పైగా సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ అయిన తరువాత పెన్షన్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని,కానీ సిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చి ఉపాధ్యాయ ఉద్యోగుల జీతాల నుండి 10 శాతం కట్ చేసి వాటిని షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టం వస్తున్నదని,అనారోగ్య కారణాలవల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారికి కనీస పెన్షన్ రాక వారి కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగుల జీతాల నుండి ఒక్క రూపాయి కూడా మినహాయింపు చేయకుండా ఓ.పి.ఎస్ ఉద్యోగుల మాదిరిగా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలని వారు కోరారు. పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగి హక్కు అని నినదించారు. మండలంలో జరిగిన నిరసన కార్యక్రమంలో యూఎస్పిసి జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు జి.హరిలాల్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాలలో ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్,ఏ.రామ్మూర్తి, బి.అమర్ సింగ్,ఎం.రమణ,వి.భాస్కరరావు,ఎం.మోహన్ రావు,బీ.భద్రు ఎం.వెంకటరామయ్య,ఈ.ముత్తయ్య, పి.నాగేశ్వరరావు,బి.శ్రీనివాస్,జానకి,శారద,సైదులు, తిరుపతి, నరసింహారావు, సరోజ,హేమ, మంగమ్మ,లోక్య,రమేష్ తదితరులు పాల్గొన్నారు.