సిపిఐ ఆందోళన: కలెక్టరేట్ల ముట్టడి

పేదలకు ఇళ్ల పట్టాల కోసం డిమాండ్‌

విజయవాడ,జూన్‌18(జ‌నం సాక్షి): పేదలు, మధ్య తరగతి వర్గాలకు పక్కా ఇళ్లు, కొండప్రాంతవాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ ఏపీ వ్యాప్తంగా సీపీఐ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ గాంధీనగర్‌లోని తహశీల్దార్‌ కార్యాలయాన్ని సీపీఐ నేతలు ముట్టడించారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.పేదలు, మధ్య తరగతి వర్గాలకు పక్కా ఇళ్లు, కొండిపాంతవాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ ఎపి వ్యాప్తంగా సిపిఐ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. శ్రీకాకుళంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మళ్లీ బాబు బిజెపితో కలిసినా ఆశ్చర్యం లేదు

నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించిందేమిటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్టాన్రికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి మోడీతో స్నేహహస్తం కోసం చంద్రబాబు చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని అవమానపర్చడమేనని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చంద్రబాబు ఎంచుకున్న పోరాట పంథా ఇదేనా? అంటూ రామకృష్ణ నిలదీశారు. అర్హులకు రేషన్‌ కార్డులు, పక్కా గృహాలు, ఇళ్లస్థలాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గుంటూరులో నిర్వహించిన సామూహిక దరఖాస్తుల సమర్పణ కార్యక్రమంలో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నాలుగేళ్లలో 20 లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని హావిూ ఇచ్చిన చంద్రబాబు కనీసం 2 లక్షల ఇళ్లను కూడా కట్టించలేదని తెలిపారు. చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం పోలవరానికి రూ.5వేల కోట్లు, రాజధాని అమరావతికి రూ.2 వేల కోట్లు ఇస్తే.. చంద్రబాబు మళ్లీ మోడీతో చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా వేశారు. చంద్రబాబు ఇకనైనా ఇలాంటి రాజకీయాలు మానుకుని ప్రత్యేక హౌదా కోసం పోరాడాలని రామకృష్ణ హితవు పలికారు.