సిపిఐ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ

 

పినపాక నియోజకవర్గం జూలై 18 (జనం సాక్షి); :అకాల వర్షాలతో గోదావరి వరదలకు నిరాశ్రయులైనా పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామ ప్రజలకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ షాబిర్ పాషా పిలుపుమేరకు ఖమ్మం యువకులు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదకు ముంపుకు గురైన బాధితుల జీవనం చూస్తే హృదయం చలించిపోయిది. కట్టుబట్టలతో వచ్చిన వారికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుండటంతో ఈ విషయాన్ని ఖమ్మనికి చెందిన జాగృతి సూపర్ స్పెషలిటి హాస్పిటల్ తోట నాగకృష్ణ,,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు.తెలుపగా వారు ఆర్థిక సహాయాన్ని చేయటానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలో తాము ఇక్కడికి వచ్చామని వెంకట్రావుపేట గ్రామంలో నిరాశ్రులైన 60 కుటుంబాలకు దుప్పట్ల తో పాటు ఓఆర్ యస్ పాకెట్లును పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రెండు దుప్పట్లు చొప్పున వెంకట్రావుపేట సర్పంచ్ వర్ష స్వాతి చేతుల మీదగా పంపిణి చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని అవకాశం ఉన్న మేరకు దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గడ్డం మనోహరా చారి, అక్కి నరసింహారావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు సొందే కుటుంబరావు, సిపిఐ పినపాక మండల కార్యదర్శి సాగిరాజు పద్మ నాభ రాజు, సహాయ కార్యదర్శి వర్ష సతీష్, నాయకులు కోయాలా కుంట్ల వెంకటరమణాచారి, పోనగంటి పురుషోత్తం, కుంట శివా , గ్రామపెద్దలు వర్స నరసింహ రావు, కప్ప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు