సిబిఐకి తుత్తుకూడి కాల్పుల ఘటన

చెన్నై,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): తూత్తుకూడి కాల్పుల కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది మద్రాస్‌ హైకోర్టు. మే నెలలో తూత్తుకూడిలో స్టెరిలైట్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ స్థానికులు నిర్వహించారు. ఈ ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో?13 మంది మృతి చెందారు. నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌ ను ప్రభుత్వం కాలరాసిందంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తూత్తుకూడి కాల్పులకు సంబంధించిన అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది.