సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరైన విూసాభారతి

న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): మనీ ల్యాండరింగ్‌ కేసులో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె మిసాభారతి, ఆమె భర్త శైలేష్‌ కుమార్‌ సోమవారం పాటిలాయాలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. సుమారు రూ.8 వేల కోట్లను అక్రమ నగదు బదిలీలు చేశారన్న ఆరోపణలపై ఈ కేసును విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి అరవింద్‌, ఇదే కేసులో మరో నిందితుడు సంతోష్‌ ఝాను కూడా కోర్టులో హాజరు పర్చమని ఆదేశిస్తూ ప్రొడెక్షన్‌ వారెంట్‌ను జారీ చేశారు. తదుపరి తదుపరి విచారణను జూన్‌ 4వతేదీకి వాయిదా వేశారు. వ్యాపారవేత్తలు సురేంద్రజైన్‌, వీరేంద్ర జైన్‌ పేరిట డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి, 
నల్లడబ్బును, తెల్లడబ్బుగా మార్చారనేది మిసాభారతి, ఆమె భర్తపై అభియోగం. ఆ ఇద్దరు వ్యాపారస్తులు కూడా కోర్టుకు హాజరయ్యారు. వారికి గత జనవరిలో రూ. రెండు లక్షల వ్యక్తిగత పూచీ కత్తుతో బెయిల్‌ మంజూరు కాగా, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతుతో మిసాభారతికి, ఆమె భర్తకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.