సిరియాపై రష్యా వైమానిక దాడులు
మాస్కో ,జూన్8(జనం సాక్షి ): రష్యా విమానాలు మళ్లీ సిరియాపై దాడి చేశాయి. ఇడ్లిబ్ ప్రావిన్సులో జరిగిన తాజా దాడిలో సుమారు 44 మంది మృతిచెందారు. జర్దానా గ్రామంలో ఈ వైమానిక దాడులు జరిగినట్లు సిరియా మానవ హక్కుల అబ్జర్వేటరీ సంస్థ పేర్కొన్నది. వైమానిక దాడిలో మరో 50 మంది గాయపడ్డారు. దీని వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బాధితుల కోసం రెస్క్యూ అధికారులు గాలిస్తున్నారు. దాడుల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు పారిపోతున్నారు.